మన టాలీవుడ్ లో ఉన్నటువంటి సాలిడ్ పెర్ఫామర్ లలో వెర్సటైల్ నటుడు సత్యదేవ్ ఒకరు. మరి సత్యదేవ్ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ తెరకెక్కించిన లేటెస్ట్ హిట్ మూవీ నే “జీబ్రా”. మరి ఫైనాన్షియల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యి సత్యదేవ్ కెరీర్ లో మంచి వసూళ్లు సాధించింది.
ఇక ఈ సినిమా ఇపుడు ఫైనల్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. కొన్ని రోజులు కితమే ఆహా గోల్డ్ ఉన్నవారికి వచ్చేసింది కానీ నేటి నుంచి ఆహా సాధారణ సబ్ స్క్రిషన్ ఉన్నవారికి కూడా వచ్చేసింది. సో ఈ సినిమా ని చూడాలి అనుకునేవారు నేటినుంచి చూడొచ్చు. మరి ఈ సినిమా లో పుష్ప ఫేమ్ నటుడు ధనుంజయ కీలక పాత్రలో నటించగా సత్య తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.