ఫెస్టివల్ సీజన్ నుంచి ఔట్ అయిన ‘జీబ్రా’ మూవీ…

'Zebra' movie out of festival season...
'Zebra' movie out of festival season...

ట్యాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న మూవీ ‘జీబ్రా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని దీపావళి కానుకగా రిలీజ్‌కి రెడీ అయ్యింది. పూర్తి థ్రిల్లర్ సినిమా గా రానున్న ఈ మూవీ పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేశాయి. దీంతో దీపావళి బరిలో ఈ మూవీ కూడా ఉండటంతో ఈ మూవీ ని చూసేందుకు ప్రేక్షకులు కొంతమేర ఆసక్తిని చూపారు.

'Zebra' movie out of festival season...
‘Zebra’ movie out of festival season…

కానీ, ఇప్పుడు దీపావళి రేస్ నుండి ‘జీబ్రా’ సినిమా తప్పుకుంది. ఈమేరకు మేకర్స్ ఒక అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల తమ మూవీ ని దీపావళి కానుకగా అందించలేకపోతున్నామని.. త్వరలోనే ఈ మూవీ కి సంబంధించిన రిలీజ్ డేట్‌ని వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. అయితే, ఈ మూవీ కి సరైన ప్రమోషన్స్ లేని కారణంగానే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది .

ఇక ఈ మూవీ లో సత్యదేవ్‌తో పాటు ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిచినెటో, డాలి ధనంజయ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ని ఈశ్వర్ కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఈ మూవీ నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడనేది వేచి చూడాలి.