గుడ్‌ న్యూస్‌ చెప్పిన నమిత

Actress Namitha married Veer On November 24th

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగులో పలు చిత్రాల్లో నటించి బొద్దుగుమ్మగా గుర్తింపు తెచ్చుకున్న నమిత ప్రస్తుతం తమిళనాట ఒకటి రెండు సినిమాలు చేస్తూ కెరీర్‌ను నెట్టుకు వస్తుంది. ఆ మద్య తమిళనాడు రాజకీయాల్లోకి నమిత వెళ్లబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని రాజకీయాల్లోకి వెళ్లలేదు. జయలలితను సాదారణంగా కలిశాను తప్ప, రాజకీయాలు ఆసక్తి లేదు అంటూ ప్రకటించింది. ఇక నమిత గురించి ఎన్నో సార్లు సోషల్‌ మీడియాలో ఎన్నో రకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. ఇటీవలే శరత్‌కుమార్‌ అనే సీనియర్‌ నటుడితో ఈ అమ్మడి పెళ్లి అంటూ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. ఆయన వయస్సేంటి, నా వయస్సు ఏంటీ ఆయనతో నా పెళ్లి ఏంటీ అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా తానే స్వయంగా పెళ్లి గురించి ఒక అధికారిక ప్రకటన చేసింది. 

గుడ్‌ న్యూస్‌ చెప్పిన నమిత - Telugu Bullet

నమిత ప్రేమలో ఉన్నట్లుగా, పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. తాజాగా నమిత ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో.. హాయ్‌, మీకో శుభవార్త చెబుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నవంబర్‌ 24, 2017న నా బాయ్‌ ఫ్రెండ్‌ వీర్‌ను వివాహం చేసుకోబోతున్నాను. ఆ అందరి మద్దతు, ఆశీర్వాదం, ప్రేమ కావాలి అంది. ఒక వీడియోను విడుదల చేసి తన బాయ్‌ ఫ్రెండ్‌ను మీడియాకు మరియు ప్రేక్షకులకు పరిచయం చేసింది. వీరిద్దరి ప్రేమ చాలా సంవత్సరాలుగా సాగుతుందని, అయితే ఎవరికి తెలియకుండా మెయింటెన్‌ చేసినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీర్‌ గురించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలో పెళ్లి కూతురు కాబోతున్న నమితకు మా తరపున మీ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాం.