‘మహానుభావుడు’ మంచి రోజు ఫిక్స్‌

mahanubhavudu-first-look-on-24th-august

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యూత్‌ ఆడియన్స్‌ను కట్టిపడేయగల సినిమాలను తెరకెక్కించే సామర్థ్యం ఉన్న దర్శకుడు మారుతి. ఈయన ‘బాబు బంగారం’ చిత్రంతో సూపర్‌ హిట్‌ను అందుకున్న విషయం తెల్సిందే. తాజాగా ఈయన శర్వానంద్‌ హీరోగా ‘మహానుభావుడు’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు మారుతి ఏర్పాట్లు చేస్తున్నాడు. మారుతి మార్క్‌ కనిపించేలా సినిమా ఉంటుందని, దానికి ఫస్ట్‌లుక్‌లో చూపించానేది ఆయన ప్లాన్‌గా తెలుస్తోంది. 

ఈనెల 24న ‘మహానుభావుడు’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేయబోతున్నారు. టీజర్‌తో పాటు పోస్టర్స్‌ను విడుదల చేయడం ద్వారా సినిమాపై అంచనాలు పెంచాలని భావిస్తున్నారు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించిన మెహ్రీన్‌ ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. సినిమాను పూర్తి చేసి దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ప్లాన్‌లో మారుతి ఉన్నట్లుగా తెలుస్తోంది. దసరాకు ఎన్టీఆర్‌, మహేష్‌బాబులు వారి వారి చిత్రాలతో రాబోతున్నారు. అయినా కూడా మారుతి తన కంటెంట్‌పై నమ్మకంతో దసరాకు వచ్చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక వేళ సెప్టెంబర్‌ మిస్‌ అయితే అక్టోబర్‌లో విడుదల ఖాయం అని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

మరిన్ని వార్తలు:

ఈ అబ్బాయిని పట్టించుకునేవారేరి?