వాళ్లకి కూడా పరిటాల పెళ్లి పిలుపు.

paritala sunitha invites to governor Narasimhan for Paritala Sriram Marriage

Posted September 13, 2017 (2 weeks ago) at 16:35 
అక్టోబర్ 1 న జరగనున్న పరిటాల శ్రీరామ్ పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. శ్రీరామ్ తల్లి, మంత్రి పరిటాల సునీతమ్మ స్వయంగా కొడుకు, కూతుళ్లతో కలిసి ముఖ్యులకు శుభలేఖలు అందిస్తున్నారు. పెళ్ళిపిలుపుల్లో భాగంగా ఆమె నేడు రాజ్ భవన్ కి వచ్చారు. గవర్నర్ నరసింహన్ కి శుభలేఖ అందించారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం కెసిఆర్ కి కూడా శ్రీరామ్ వివాహం కోసం ఆహ్వానం పలుకుతున్నారు. స్వగ్రామం వెంకటాపురంలో భారీ ఎత్తున చేస్తున్న ఈ పెళ్ళికి ప్రముఖులతో పరిటాల రవి అభిమానులకి కూడా సునీతమ్మ ప్రత్యేకంగా ఆహ్వానం అందించనున్నారు. పరిటాల రవి హత్య తర్వాత జరిగిన గొడవలకి సంబంధించిన కేసుల్లో ఇరుక్కున్న వారిని శ్రీరామ్ పెళ్లివేడుకలకి తప్పనిసరిగా వచ్చేట్టు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు:

కమల్ స్పీడ్ కి రజని,పవన్ షాక్.

టికెట్లు ఇవ్వ‌డంలో ఆ కండ‌క్ట‌ర్ స్ట‌యిల్ ఇదీ…

శశికళ గుట్టు మీడియా చేతికి చిక్కింది.