రెబల్‌స్టార్‌ కాదు.. బ్లాక్‌ బస్టర్‌ కింగ్‌

prabhas-is-the-new-blockbuster-king-says-bollywood-celebrities

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు నట వారసుడిగా ప్రభాస్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెల్సిందే. దాంతో ప్రభాస్‌ను ఫ్యాన్స్‌ అంతా కూడా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అంటూ ఉంటారు. కొందరు రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ‘బాహుబలి’ సినిమాతో అద్వితీయమైన గుర్తింపును దక్కించుకున్న ప్రభాస్‌కు బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. అందుకే బ్లాక్‌ బస్టర్‌ కింగ్‌ ప్రభాస్‌ అంటూ బాలీవుడ్‌ ప్రముఖులు పిలుస్తున్నారు. బాలీవుడ్‌లో దుమ్ము లేపిన బాహుబలి సినిమాలో నటించాడు కనుక ప్రభాస్‌కు అలాంటి పేరును పెట్టినట్లుగా అక్కడ మీడియా వారు అంటున్నారు. 

ఇక ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా ఇకపై తమ అభిమాన హీరోను బ్లాక్‌ బస్టర్‌ కింగ్‌ అంటూ సంభోదించబోతున్నారు. భారీ విజయాన్ని అందుకు ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కూడా ప్రభాస్‌కు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ‘సాహో’ కూడా సూపర్‌ హిట్‌ అయితే ప్రభాస్‌కు బ్లాక్‌బస్టర్‌ కింగ్‌ బిరుదు పర్మినెంట్‌ అవ్వడం ఖాయం. బాలీవుడ్‌ మీడియా ఇచ్చిన ఈ బిరుదుపై ప్రభాస్‌ ఇంకా స్పందించలేదు. ఇటీవల ప్రభాస్‌ను ఒక బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ బ్లాక్‌ బస్టర్‌ కింగ్‌ ప్రభాస్‌ అంటూ సంబోధించడం అందరిని ఆశ్చర్యంకు గురి చేసింది. ఆ టైటిల్‌కు ప్రభాస్‌ ఖచ్చితంగా అర్హుడే అంటూ ఫ్యాన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

ఫిదా … తెలుగు బులెట్ రివ్యూ

ఇది మరీ ఓవర్‌ బోయపాటి