‘రాజా ది గ్రేట్‌’కు కూడా గెలుకుడు తప్పలేదు…

Ravi teja Raja The Great Movie Reshoot mode

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇటీవల దిల్‌రాజు నిర్మిస్తున్న ప్రతి సినిమా కూడా రీ షూట్‌లను జరుపుకుంటున్నాయి. నాని ‘నేను లోకల్‌’, ‘ఫిదా’, ‘జవాన్‌’, తాజాగా తెరకెక్కుతున్న ‘రాజా ది గ్రేట్‌’. షూటింగ్‌ అంతా కూడా పూర్తి అయిన తర్వాత సినిమా రషెష్‌ను దిల్‌రాజు చూడటం, ఏవైనా సీన్స్‌ ఆకట్టుకోకుంటే వెంటనే వాటికి రీ షూట్‌ చెప్పడం చాలా కామన్‌ అయ్యింది. తాజాగా కూడా రవితేజ, అనీల్‌ రావిపూడిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలోని కొన్ని సీన్స్‌ను రీ షూట్‌ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రవితేజ గుడ్డివాడిగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సినిమాతో రవితేజ తనయుడు తెరంగేట్రం చేయబోతున్నాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌ దిల్‌రాజును మెప్పించలేక పోయాయి. దాంతో రవితేజ మరియు దర్శకుడు అనీల్‌లు రీషూట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారం రోజుల పాటు రీ షూట్‌ను చేసి చిత్రాన్ని అనుకున్న సమాయానికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. రవితేజ కెరీర్‌లో బెస్ట్‌ మూవీగా ఇది నిలుస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.