సల్మాన్‌ చెత్త వ్యాఖ్యలు

Salman comments on the South Audience

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బాలీవుడ్‌ కండల వీరుడు, స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ‘బాహుబలి 2’ చిత్రం బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన విషయాన్ని ప్రస్థావిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారంను రేపుతున్నాయి. బాలీవుడ్‌ ప్రేక్షకులు హీరోను పట్టించుకోకుండా సినిమా బాగుందని ‘బాహుబలి 2’ను చూసి అంత పెద్ద సక్సెస్‌ చేశారు అని, హిందీ ప్రేక్షకులకు సౌత్‌కు చెందిన ఇద్దరు ముగ్గురు హీరోలు మాత్రమే తెలుసు. ‘బాహుబలి’ హీరో తెలియకున్నా సినిమాపై వచ్చిన క్రేజ్‌ దృష్ట్యా చూసి సక్సెస్‌ చేశారు. అయితే సినిమా బాగున్నా కూడా ఉత్తరాది చిత్రాలను సౌత్‌ ప్రేక్షకులు ఆధరించరు అని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ‘ట్యూబ్‌లైట్‌’ చిత్రం ప్రమోషన్‌లో ఉన్న సల్మాన్‌ ఖాన్‌ సౌత్‌ ఆడియన్స్‌పై అక్కస్సును వెళ్లగక్కాడు. బాలీవుడ్‌ చిత్రాలను సౌత్‌లో విడుదల చేసినా కూడా ఆధరించరు అని, గతంలో తన పలు చిత్రాలు సౌత్‌ భాషల్లో డబ్‌ అయ్యాయి. కాని ఒక్కదానికి కూడా సరైన కలెక్షన్స్‌ రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. నార్త్‌ ఆడియన్స్‌ మాత్రం అలా కాదని, సౌత్‌ నుండి వచ్చిన సినిమాలు బాగుంటే తప్పకుండా ఆధరిస్తారని చెప్పుకొచ్చాడు. ఇక సౌత్‌లో రజినీకాంత్‌ను అభిమానించే వ్యక్తి చివరి వరకు రజినీకాంత్‌ ఫ్యాన్‌గానే ఉంటాడు. అలాగే కమల్‌ను అభిమానించే వారు కమల్‌ సినిమాలు మాత్రమే చూస్తారు అంటూ సౌత్‌ ఆడియన్స్‌ గురించి సల్మాన్‌ వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన తాజా చిత్రం కూడా సౌత్‌లో ఆడుతుందనే నమ్మకం తనకు లేదు అని సన్నిహిత పాత్రికేయుల వద్ద సల్మాన్‌ అన్నట్లుగా తెలుస్తోంది.