అమెజాన్ ప్రైమ్ లో రానున్న మరో స్టార్ హీరో మూవీ

అమెజాన్ ప్రైమ్ లో రానున్న మరో స్టార్ హీరో మూవీ

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య శివకుమార్ కు అటు తమిళ్ లోను ఇటు తెలుగు లోను మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే తన ప్రతీ సినిమాను కూడా సూర్య కోలీవుడ్ తో పాటు మన తెలుగు లో కూడా విడుదల చేస్తుంటారు. అలా లేటెస్ట్ గా తాను నటించిన చిత్రం “ఆకాశమే నీహద్దురా” చిత్రంను కూడా ప్లాన్ చేసారు. అయితే థియేటర్స్ లోనే విడుదల చేయడానికి రెడీ చేసిన ఈ చిత్రం ఇప్పుడు పరిస్థితుల రీత్యా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి రానుంది.

అందులో భాగంగానే అక్టోబర్ లో అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల కానుందట మొదట ఏకంగా 150 దేశాల్లో విడుదల కానుంది అని టాక్ రాగా సూర్య నిర్మాణ సంస్థకు కో ప్రొడ్యూసర్ మరియు దర్శకుడు రాజశేఖర్ పాండియన్ భారీ ఎత్తున అక్టోబర్ 30 న 200ల దేశాల్లో విడుదల కానుంది అని తెలిపారు. సుధా కాంగ్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించగా జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.