అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ కు కరోనా పాజిటివ్ గా తెలియడంతో, జో బైడెన్ కు కూడా కరోనా ఉంటుందేమోనని అనుమానంతో ఆయనకు కూడా పరీక్షలు నిర్వహించగా ఆశ్చర్యకరంగా ఆయనకు నెగటివ్ గా రిపోర్ట్ వచ్చింది. అమెరికా శ్వేత సౌధం ఈ విషయాన్ని వెల్లడించింది, కాగా జిల్ బైడెన్ ఇప్పుడు దిలావర్ లోని రిహాబోత్ బీచ్ లోని తన ఇంట్లో ఉన్నారు.
ఇక ఈ పరిస్థితుల్లో ఢిల్లీ లో జరగనున్న జీ 20 సమావేశాలకు జో బైడెన్ హాజరు అవుతారా లేదా అన్న విషయంపై ఇంకా సందిగ్దత నెలకొంది. ఇదిలా ఉంటే అమెరికాలో కరోనా కేసులు ఎక్కువ అవుతుండడంతో వైద్యులు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ ప్రజలకు సలహా ఇస్తున్నారు.ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోనిదే బయటకు రావొద్దంటూ అధ్యక్షుడు స్వయంగా ప్రజలను ఉద్దేశించి తెలియచేశారు.