కరోనా వైరస్ కి సంబంధించి భారతదేశానికి ఒక శుభవార్త. ఈ వ్యాధి సోకిందో లేదో అని తెలుసుకోవడానికే చేసే టెస్టు కోసం ఎంతో కష్టపడి.. చాలా సమయం వెచ్చించాల్సి వచ్చేది. అయితే తాజాగా కొన్ని గంటల్లోనే ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయా? లేవా? అని కనుక్కొనే కిట్ ని మహారాష్ట్రలోని పూణేకు చెందిన మై ల్యాబ్స్ అనే సంస్థ తయారు చేసింది. దీనికి డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా.. అలాగే ఎఫ్డిఎ వీళ్లంతా అనుమతులు కూడా ఇచ్చేశారు.
దీంతో ఇప్పుడు మనకి వేగవంతంగా వ్యాధి లక్షణాలు కనుక్కొని ఉన్నాయా? లేదా? అని తెలుసుకోవచ్చు. గతంలో ఇలా టెస్ట్ చెయ్యటానికి రెండ్రోజులు సమం పట్టేది. ఆ టెస్టులను పుణేకు పంపిస్తే రిపోర్ట్ వచ్చే దాని మీద ట్రీట్మెంట్ మొదలు పెట్టేవారు. అలా వాళ్ళని ఐసోలేట్ చేయడానికి… క్వారంటైన్ చెయ్యటానికి చాలా సమయం పట్టేది. ఇప్పుడు ఏమవుతుందంటే.. ఈ కిట్ ద్వారా చాలా వేగవంతంగా ఫలితాలు అన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇది ప్రపంచంలోనే రెండోది. జర్మనీ ఒక కిట్ లాంటిది తయారు చేసింది. దాని తర్వాత మన భారతదేశంలో ఇలాంటి కిట్ తయారు కావడం శుభపరిణామంగా చెప్పవచ్చు.