ఈ నెల 8 లోపు టీచర్ల వేతనాలు చెల్లిస్తాం – మంత్రి బొత్స

BREAKING: DSC notification released in AP
BREAKING: DSC notification released in AP

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ల వేతనాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీరియస్‌ అయ్యారు. టీచర్ల వేతనాలు ఈ నెల 8 లోపు చెల్లిస్తాం మంత్రి బొత్స ప్రకటిచారు. నిన్న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్య కోసం సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రైవేటు స్కూల్స్ తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలోనే ఉత్తమ ర్యాంకులు వచ్చాయని పేర్కొన్నారు. విశాఖలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకునే వారు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారు. విద్య కోసం సీఎం జగన్ ఎంతో చేస్తున్నారు. 60వేల క్లాస్ రూమ్స్ లో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాద్యాయులు మా కుటుంబ సభ్యులే అని కీలక వ్యాఖ్యలు చేశారు.