ఆంధ్రప్రదేశ్ లో ఎంఫాన్ తుపాన్ కారణంగా ఈ మధ్య విశాఖలో ముందుకొచ్చిన సముద్రం ఇప్పుడు వెనక్కి వెళ్లింది. ముందుకొచ్చిన సముద్రం కెరటాలతో విరుకు పడడంతో తీరప్రాంత వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే.. తుపాను నిన్న తీరం దాటడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా మత్స్యకారుల మొకాల్లో చిరునవ్వులు తాండవిస్తున్నాయి. అయితే సుముద్రం అల్లకల్లోలంగా మారడంతో లోపలి నుంచి రొయ్యలు తీరానికి కొట్టుకొచ్చాయి. దీంతో వాటిని ఏరుకునేందుకు మత్స్యకారులు పోటీపడుతున్నారు.
కాగ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఎంఫాన్ తుఫాను కారణంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలు కాస్త బిడియానికి లోనయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలుదీవి, ఉప్పాడ, ఓడల రేవు వంటి ప్రాంతాల్లో సముద్రం 20 మీటర్ల మేర ముందు కొచ్చింది. మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉప్పాడ, కోనపాపపేట, మాయా పట్నం, సూరాడపేట, మూలపేట గ్రామాల్లోని మత్స్యకార కాలనీల్లోకి సముద్ర జలాలు ప్రవేశించాయి. అలల తాకిడికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో మృత్యకారులు కాస్త ఆందోళనకు లోనయ్యారు.