ఒక సంవత్సరంలో 20 శాతం పైగా పెరిగిన బీజేపీ ఆస్తులు … !

Election Updates: The list of BJP candidates will be released before the 21st of this month!
Election Updates: The list of BJP candidates will be released before the 21st of this month!

ముఖ్యమైన రాజకీయ పార్టీల ఆస్తుల గురించిన ప్రతి సంవత్సరం పూర్తి వివరాలను ADR ఒక నివేదికను ప్రకటిస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా భారతీయ రాజకీయ పార్టీల ఆస్తులను ప్రకటించింది. ఇందులో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వాటి ఆస్తులను రూ. 6046 .81 కోట్లు గా ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ కు రూ. 805 .68 కోట్లు ఆస్తులు ఉన్నాయంటూ తెలిపింది. ఇక BSP కి రూ. 690 .71 కోట్లు మరియు తృణమూల్ కాంగ్రెస్ కు రూ. 458 .10 కోట్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ ఆస్తుల పట్టి చూస్తే బీజేపీకి అత్యధికంగా ఆస్తులు ఉన్నాయని స్పష్టంగా అర్ధమవుతోంది.

ఇక ఈ సంవత్సరం బీజేపీ ఆస్తులు విలువ గత సంవత్సరం కంటే 20 శాతం పెరిగాయి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆస్తులు గత సంవత్సరంతో పోలిస్తే 16 .6 శాతం పెరిగాయి.ఇక దేశంలోని మొత్తం రాజకీయ పార్టీల ఆస్తుల విలువను చూస్తే రూ. 8829 కోట్లు ఉన్నాయి. మరి బీజేపీని ఆస్తుల పెరుగుదల గురించి విపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉందా లేదా అన్నది చూడాలి.