కరోనా ప్రభావం కారణంగా దేశమంతా లాక్ డౌన్ చేసిన కారణంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదశ్ ప్రభుత్వం హైస్కూల్ విద్యార్థులపై సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమంటే… పదవ తరగతి పరీక్షలు కాకుండా మిగతా తరగతి వాళ్లను అంటే 6నుంచి 9వ తరగతి వరకు ఉన్న స్టూడెంట్స్ కు యాన్యువల్ పరీక్షలను రరద్దు చేసింది. ఆ పరీక్షలు లేకుండానే డైరెక్ట్ గా నెక్ట్స్ క్లాస్ లోకి ప్రమోట్ చేస్తున్నట్లు తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే.. పదవ తరగతి పరీక్షలను మాత్రం కరనా ప్రభావం తగ్గిన తర్వాత జరిపే అవకాశాలు ఉన్నాయి.