ముఖ్యంగా సీఎం కేసీఆర్ ముందుంచే ప్రధానమైన అంశాల్లో థియోటర్లలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. కేవలం బుక్ అయిన సీట్లకు మాత్రమే ట్యాక్స్ కట్టే విషయాన్ని ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే… షూటింగ్ లకు ఇతర రాష్ట్రాల్లో అనుమతులు లేనందున ఇక్కడ ఉన్న లోకేషన్లలో షూటింగ్ చేసుకొనేందుకు కొంత రాయితీ ఇవ్వాలని కూడా ప్రతిపాదనలను సీఎం ముందు ఉంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రిలీజ్ కాబోయో సినిమాలకు కొన్ని పన్ను రాయితీలను కోరనున్నారు. ఇక షూటింగ్ లు మొదలు పెడితే పరిమిత సంఖ్యలో 50 మందితో ఇన్ డోర్, ఔట్ డోర్ షూటింగ్ ఎలా చేస్తామన్నది ప్రజెంటేషన్ రూపంలో సీఎంకి సమర్పించనున్నారు. కాగా సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యేందుకు ప్రగతిభవన్ కి చేరుకున్నవారిలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, ఎన్.శంకర్, అల్లు అరవింద్, దిల్ రాజు, రాధాకృష్ణ, సి.కల్యాణ్, సురేష్‌బాబు, కొరటాల శివ…ఉన్నారు.