చిన్నారులపై గోడ కూలిపోయిన విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై గోడ కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఉరవకొండ మండలం వై.రాంపురంలో ఈ దుర్ఘటన జరిగింది.
గ్రామానికి చెందిన బాలుడు సుజన్(7) తన స్నేహితుడితో ఆడుకుంటుడగా ఒక్కసారిగా గోడ కుప్పకూలింది. గోడ కింద పడిన ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. సుజన్ గాయాలతో అక్కడే చనిపోగా మరొకరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ముక్కుపచ్చలారని చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.