టాలీవుడ్ ఘన చరిత్రను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి. ఆ సినిమాలోని విలన్ అయిన భళ్ళాలదేవుడు పాత్రకు ఎంత ఆదరణ వచ్చింది తెలిసిందే. ఆ పాత్రను ధరించింది రానా దగ్గుబాటి. అయితే తాజాగా రానా దగ్గుబాటి ఫ్యాన్స్ అందరికీ సర్పైంజ్ ఇచ్చాడు. అదేమంటే.. లాక్ డౌన్ కాలంలో లాక్ అయినట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. షాకిచ్చేలా త్వరలో తన ప్రేయసి మిహీకాని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించేశారు. అయితే తాజాగా మే 20న ఇరు కుటుంబ సభ్యులు కలిసి ఎంగేజ్మెంట్, పెళ్లికి సంబంధించిన మాట ముచ్చటా జరిపుకున్నట్లు తెలుస్తోంది.