ట్రేండింగ్ అవుతున్న “లవ్ స్టోరీ ” మూవీ టీజర్ .

ట్రేండింగ్ అవుతున్న "లవ్ స్టోరీ " మూవీ టీజర్ .

టాలీవుడ్ లో యూత్ ని అట్రాక్ట్ చెయ్యగలిగే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఈయన అప్పుడు “హ్యాపీ డేస్” నుంచి ఇప్పుడు “లవ్ స్టోరీ” వరకు తనదైన బెంచ్ మార్క్ సినిమాలను తీసి ఆకట్టున్నారు. ఒకప్పుడ్డు ఫిదా లాంటి బ్లాక్‌బస్టర్ ఆ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఈ అందమైన లవ్ స్టోరీలో నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. తాజాగా “లవ్ స్టోరీ ” టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఉన్న ఆతృతను రెట్టింపు చేశారు.

ఈ టీజర్‌లో ప్రతి ఫ్రేమ్ కూడా యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది. లైఫ్‌‌లో సెటిల్ కావడం కోసం ఇటు నాగ చైతన్య, అటు సాయి పల్లవి పడిన కష్టాలు.. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమను శేఖర్ కమ్ముల తనదైన శైలిలో కెమెరాలో బంధించారని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఆశ నిరాశల జీవితంలో ఈ అందమైన ప్రేమ ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలాన్ని పెంచేశారు. కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, వినోదం అన్ని అంశాల కలబోతగా ఈ లవ్ స్టోరీ రూపొందించారని టీజర్‌తో చెప్పేశారు.అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.