సీరియల్ యాక్టర్ రవికృష్ణ.. అంటే సీరియల్స్ చూసే ప్రతిఒక్కరికి తెలిసేఉంటుంది. ఇప్పటివరకు రవికృష్ణ బుల్లితెరపై సత్తాచాటి సడెన్‌గా వెండితెరపై కి ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్షలో కీలక పాత్రలో కనిపించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు . ఈ మూవీలో రవికృష్ణ పోషించిన భైరవ్/ కుమార్ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. మొగలిరేకులు, వరూధుని పరిణయం, శ్రీనివాస కల్యాణం, మనసు మమత, బావా మరదళ్లు, ఆమె కథ.. ఇలా ఎన్నో సీరియల్స్లలో , టీవీషోలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రవికృష్ణ. ఆ తర్వాత star maa షోస్ లో ప్రముఖ రియాలిటీ షో ఐన బిగ్‌బాస్‌లోనూ సందడి చేశాడు. ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా డేటింగ్ విషయాలతోనూ వార్తల్లోనూ నిలుస్తున్నాడు రవికృష్ణ. ప్రముఖ సీరియల్ నటి నవ్య స్వామితో ఇతను డేటింగ్లో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. స్టార్ మాలో ప్రసారం ఐనా “ఆమె కథ “సీరియల్లో జంటగా నటించిన రవి- నవ్య అప్పట్నుంచి ఎక్కడ చూసిన జంటగానే కనిపిస్తున్నారు. పలు టీవీషోల్లో జోడీగానే పార్టిసిపేట్ చేస్తున్నారు.దానికి తోడు ఇటీవల ఈటీవీలో ప్రసారం అయిన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ ఇద్దరికి పెళ్లి కూడా చేశారు. ఇక ఆ షోలో వీరిద్దరు కూడా తమ మధ్య ప్రేమ ఉన్నట్లుగా చాలా చనువుగా కనిపించారు. దీంతో వీరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా నవ్యస్వామితో డేటింగ్ విషయంపై స్పందించిన రవికృష్ణ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు .
‘నవ్యస్వామి నా బెస్ట్ ఫ్రెండ్. మా ఇద్దరి మధ్య ఉన్న రేలషన్ షిప్ ఫ్రెండ్స్ షిప్ . లాస్ట్‌గా తనతోనే సీరియల్ చేశాను. ఏదైనా షోకి ఒక జంట కావాలనుకున్నప్పుడు, మాది హిట్ పెయిర్ కావడంతో పిలిచేవారు. తనకు, నాకు కంఫోర్ట్ జోన్ కావడంతో కంటిన్యూ అయ్యాం. మేం ప్రతిరోజూ టచ్ లో ఉంటాం. బెస్ట్ ఫ్రెండ్, చూసేవాళ్లకేమో లవర్స్ అన్న ఫీలింగ్. అయితే ఆమె ప్రపోజ్ చేసినప్పుడు చూద్దాం’ అంటే ఇన్ డైరెక్టుగా నవ్య అంటే ప్రేమని చెప్పుకొచ్చాడు రవికృష్ణ. కాగా నవ్య స్వామి కూడా రీసెంట్ వెండితెరపై కి ఎంట్రీ ఇచ్చింది రవితేజ హీరోగా రిలీజైన “రావణాసుర “మూవీలో నవ్య స్వామి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.