ఇటీవలే అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇప్పుడు మరోవ విదేశీ పర్యటనకు బయల్దేరనున్నారు. ఈ విషయాన్ని తాజాగా విదేశాంగ శాఖ అధికారులు ప్రకటించారు. ఇండియా-ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొనేందుకు ఇండోనేషియా రాజధాని జకార్తాకు బుధవారం రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బయలుదేరనున్నారని వెల్లడించారు.
గురువారం 20వ ఇండియా-ఆసియాన్ , 18వ తూర్పు ఆసియా సదస్సులు జరగనున్న నేపథ్యంలో 10 దేశాలు పాల్గొంటాయి. ఈ సదస్సుల్లో ప్రధానంగా సముద్ర తీరప్రాంత భద్రతలో సహకారంపైచర్చించనున్నారు. ఆసియాన్‌లో ఇండియాతోపాటు చైనా, జపాన్,అమెరికా, ఆస్ట్రేలియాలు చర్చల భాగస్వాములుగా ఉన్నాయి.
భారత్ వాణిజ్య ,భద్రత అంశాలపై ఆయా నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానంగా చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం గురువారం రోజున సాయంత్రం ప్రధాని భారత్‌కు తిరిగిరానున్నట్లు వెల్లడించారు. జకార్తా పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.