నేడు భారత్​కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ప్రధాని మోదీ భేటీ..

US President Joe Biden, Prime Minister Modi met India today.
US President Joe Biden, Prime Minister Modi met India today.

ఈనెల 9, 10వ తేదీల్లో భారత్​ వేదికగా దిల్లీలో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు రంగం సిద్ధం అవుతోంది. ఈ సమావేశాల్లో పాల్గొనడానికి అగ్రదేశాధినేతలు ఇవాళ దిల్లీకి రానున్నారు. ఈరోజు ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అవనున్నారు. జో బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న మోదీ.. ఈ భేటీలో శుద్ధ ఇంధనం, వాణిజ్యంపై చర్చించనున్నారు. హైటెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఇరు దేశాల బంధంపై సమీక్ష జరపనున్నారు. అలాగే రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంపై చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఇటీవల మోదీ అమెరికా పర్యటనలో కుదిరిన ఒప్పందాల పురోగతిపై సమీక్ష చేసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.

అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి పనిచేయడానికి అమెరికా కట్టుబడి ఉందని ఇప్పటికే బైడెన్ చెప్పారు చెప్పారు. జీ-20 పట్ల అమెరికా నిబద్ధత ఏ మాత్రం తగ్గలేదన్నారు , ప్రపంచంలోని సవాలు,, ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో కూడా కలిసి పనిచేయగలవన్న నమ్మకాన్ని ఈ సమావేశం కలిగిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. జీ 20 సమావేశాల తర్వాత బైడెన్ వియత్నాం పర్యటనకు వెళ్లనున్నారు.