పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రం సంచలన నిర్ణయం …

జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తున్నట్లు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ భూమిలో కరగడానికి చాలా కాలం పడుతుంది. దీంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్‌ వాడకంతోపాటు.. వాటిని ఉత్పత్తి చేయడం.. నిల్వ, పంపిణీ, అమ్మకంపైనా నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం మంగళవారం ప్రకటించింది. ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువుల నిషేధం కోసం జాతీయంగా, రాష్ట్రాల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తామని పర్యావరణ, అటవీ శాఖ వెల్లడించింది.

కేంద్రం నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల జాబితాలో.. ప్లాస్టిక్ స్టిక్‌లతో కూడిన ఇయర్ బడ్స్, బెలూన్ల కోసం వాడే ప్లాస్టిక్ స్టిక్‌లు, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్‌లు, ఐస్ క్రీం స్టిక్‌లు, డెకరేషన్ కోసం వాడే పాలిస్టిరిన్ (థర్మాకోల్), ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్‌తో చేసే కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రా, ట్రేలు, స్వీట్ బాక్సు‌ల్లో వాడే ప్యాకింగ్ ఫిల్మ్‌లు, ఆహ్వాన పత్రికలు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు ఉన్నాయి.