ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికలల్లో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ ఎంతటి దారుణమైన ఓటమిని కూడగట్టుకుందో మనందరికీ తెలిసిందే. కాగా ఎప్పుడైతే ఎన్నికల్లో అంతలా ఓడిపోయిందో ఇక జనసేన పార్టీకి భవిష్యత్తు లేదని గ్రహించిన నేతలందరూ కూడా జనసేన పార్టీని వదిలేస్తున్నారు. ఇకపోతే కేంద్రంలో వరుసగా రెండవసారి అధికారాన్ని దక్కించుకున్నటువంటి బీజేపీ పార్టీ ఏపీలో ఇతర పార్టీల అసమ్మతి నేతలందరినీ కూడా తమతో కలుపుకొని పోతుంది. కాగా జనసేన నుండి బయటకు వచ్చిన వారందరు కూడా బీజేపీలో చేరడానికి బాగా మొగ్గుచూపుతున్నారు.
కాగా జనసేన నుండి మరొక నేత బీజేపీ లో చేరిపోయారు. తాజాగా, ‘జనసేన’ గిరిజన నేత రాజారావు, తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరిపోయారు. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో వీరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇకపోతే రాష్ట్రంలో వైసీపీ కి వ్యతిరేకంగా గాలి వీస్తోందని, త్వరలోనే అందరు కూడా బీజేపీ ని గెలిపించడానికి కృషి చేస్తారని, రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.