పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ ఎయిర్ పోర్టు సమీపంలో విమానం కుప్పకూలినట్లు సమాచారం అందుతుంది. లాహోర్ నుంచి కరాచీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 90మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ బస్ 320 కుప్పకూలిందని ఉర్దూ మీడియా సంస్థ వెల్లడించింది. విమాన ప్రమాదంలో ప్రయాణిస్తున్న వారంతా మరణించి ఉండారని కూడా సమాచారం.
అదేవిధంగా కరాచీలోని మహ్మద్ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కు రెడీ అవుతోన్న సమయంలో విమానాశ్రయం సమీపంలోని మోడల్ కాలనీ జనావాసాల మధ్యలో విమానం కుప్ప కూలింది. కాగా ఈ ప్రాంతంలో భారీ సంఖ్యలో ప్రజలు నివసిస్తుంటారని తెలుస్తోంది. కాగా విమానంలో ఉన్న 90మందితో పాటు కూలిన ప్రాంతం నివాసయోగ్యం కావడంతో మృతుల సంఖ్య వందకు పైగానే ఉంటుందని అంచనా. అయితే ఆ విమానం కూలిన ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది.