పొలంలో మందు కొట్టేందుకు వెళ్లి.. చెరువులో పడి ముగ్గురు మృతి

ప్రాణం తీసిన ఈత సరదా

తెలంగాణలో ఘోరం జరిగింది. పొలం పనులకి అని వెళ్లి మగ్గురు చెరువులో పడి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్‌ మండలంలో చోటుచేసుకుంది. స్థానికంగా లక్ష్మీపురంలో ఉన్న రేపాక చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన నల్లమోతు అప్పారావు, తేజస్‌, వినయ్‌ మృత్యువాత పడ్డారు.

అదే విధంగా అప్పారావు, తేజస్‌ తండ్రీ కొడుకులు కాగా.. వినయ్‌… అప్పారావు మేనల్లుడు. ఈరోజు ఉదయం ముగ్గురూ కలిసి పొలం వద్దకు వెళ్లి దోస చేనుకు మందు కొట్టారు. ఆ తర్వాత శరీరమంతా ఏదో మంటగా అన్పించండటంతో తేజస్‌ పక్కనే ఉన్న చెరువులో కడుక్కోవడానికి వెళ్లాడు. అతను తిరిగి రాకపోవడంతో అప్పారావు వెళ్లి చూడగా వినయ్‌ చెరువులో మునిగిపోతూ కన్పించాడు. అతన్ని రక్షించడానికి చెరువులోకి దిగిన అప్పారావు కూడా అందులో మునిగిపోయాడు. దీంతో వారిద్దరికోసం వెళ్లిన వినయ్‌ వారితో పాటే మునిగి పోయాడు. ముగ్గురి మృతదేహాలను స్థానికులు గుర్తించి బయటకు తీశారు. దీంతో ఆ గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. కుంటుంబంలో ముగ్గురూ మరణించడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.