ప్రియుడు బ్రేకప్ కి.. ప్రియురాలు ఏం చేసిందో తెలుసా

చైనాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ప్రేయసీ ప్రియుల మధ్య వింత పరిణామాలు సంభవించుకున్నాయి. అదేమంటే.. ఏడాది కిందట ఏదో రకంగా మాయమాటలు చెప్పి ప్రియురాలిని బుట్టలో వేసుకున్నాడు ప్రియుడు. ఆ తర్వాత ఆమెను నమ్మించి అన్నిరకాలుగా సంవత్సరం పాటు తిరిగేశారు. మరిప్పుడు ప్రియుడు ఆమెకు కనిపించకుండా తిరుగుతూ బ్రేకప్ అంటూ కూనిరాగాలు తీయడం మొదలు పెట్టాడు. దీంతో ప్రియురాలికి మండింది. పగ.. ప్రేమతో కూడిన కసి అన్నీ ఏకమై ప్రియుడిపై కసి తీర్చుకోవాలని భావించింది. అతన్ని ఏడిపించాలని భావించిన ప్రియురాలు కోపంతో ఏకంగా వెయ్యికిలోల ఉల్లిపాయలను ప్రియుడి ఇంటికి ఆర్డర్ చేసింది. ఆ పిక్ ఇప్పుడు సోషల్ మడియాలో వైరల్ గా మారింది.

చైనాలోని జిబో ప్రాంతంలో సంవత్సరం పాటు ప్రేమించుకున్న తర్వాత ఓ యువకుడు, తన ప్రేయసి జావోకు బ్రేకప్ చెప్పాడు. దీంతో ఆమె గుండె పగిలింది. మూడు రోజుల పాటు ఏడ్చేసింది. తనకు బ్రేకప్ చెప్పిన తర్వాత ఏ మాత్రం ప్రియుడు బాధపడటం లేదని.. ఆగ్రహంతో రగిలిపోయింది. అతన్ని ఏడిపించాలన్న ఆలోచనతో ఏకంగా 1000 కిలోల ఉల్లిపాయలను అతనింటికి డోర్ డెలివరీ చేయించింది. అయితే కొన్ని కండిషన్స్ పెట్టింది. అదేమంటే.. అతన్ని కలవకుండా, అతనికి తెలియకుండా, ఉల్లిపాయల మొత్తాన్ని ఇంటి వద్ద వేసి రావాలని డెలివరీ సంస్థకు స్పష్టం చేసింది. అంతేకాకుండా ‘నేను మూడు రోజుల పాటు ఏడ్చాను. ఇక నీ వంతు’ అంటూ ఓ మెసేజ్ ని కూడా పంపింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. తన ఇంటి ముందున్న ఉల్లిపాయలను ఏం చేయాలో తెలియక ఆప్రియుడు నానాపాట్లు పడుతున్నాడు. ఇంకా అందరికీ తెలిసిపోతుందేమోనని. తెబిత్తరపోయి చూస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై స్పందిస్తూ.. ఆమెకు పొగరు ఎక్కువని, నాటకాలు ఆడుతోందని ప్రియుడు ఆగ్రహించాడు. బ్రేకప్ తర్వాత తాను కూడా బాధపడ్డానని ప్రియుడు వెల్లడించాడు.