ప్రేమ కోసం ఆ పని చేశా : సాయిపల్లవి ప్రేమ గురించి ఆమె చెప్పిన మాట..

అందం, అభినయం కలగలిపిన నటి సాయిపల్లవి. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగి తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించే ఈ బ్యూటీ.. ‘విరాటపర్వం’తో మరోసారి ప్రేక్షకులను మెప్పించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ గురించి ఆమె చెప్పిన మాటలపై అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?

నక్సలిజం, ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. కాబట్టీ చిత్రబృందం ఎక్కడికి వెళ్లినా ఈ టాపిక్​ మీదనే ఎక్కువగా మాట్లాడుతున్నారు.ఈ సందర్భంగా సాయిపల్లవి.. ఆమెలో ఉన్న ప్రేమ గురించి చెప్తూ ఓ సంఘటనను వివరించారు.నేను వెజిటేరియన్‌. నాకస్సలు నాన్‌ వెజ్‌ గురించి తెలియదు. కానీ ఒక వ్యక్తి కోసం ఓసారి షాప్‌కు వెళ్లి.. చికెన్‌ తీసుకువచ్చి వండి పెట్టాను. ఆరోజు నాకెంతో ఆనందంగా అనిపించింది. నాలో ఇంత ప్రేమ ఉందా అని నవ్వుకున్నా’ అని సాయిపల్లవి అన్నారు.

అయితే ఆ వ్యక్తి ఎవరు? అనేది ఆమె చెప్పలేదు.దీంతో సాయిపల్లవి ప్రేమలో పడిందని.. ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన సంగతులు దానికి సంబంధించినవే అని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు.ఇప్పటికే ‘విరాటపర్వం ‘ రిలీజ్​ తర్వాత సాయిపల్లవి పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఈ మాటలు ఆ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లు అయింది.మరోవైపు రానా.. సాయిపల్లవిపై ప్రశంసలు కురిపించారు. ఆమె చాలా మంచి నటి అని.. తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.