కరీంనగర్ జిల్లా లోని దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు ప్రేమ పేరుతో మైనర్ బాలికను తల్లిని చేశాడు దాంతో ఈ విషయం చెప్పితనని పెళ్లి చేసుకోమని అడగడంతో మొహం చాటేస్తున్నాడు.. దీంతో మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు విషయానికి వస్తే కరీంనగర్ జిల్లాలో గత రెండేళ్ల క్రితం ఒక షాప్ లో పనిచేస్తున్న సమయంలో సమీర్ అనే యువకుడు మైనర్ బాలికతో పరిచయం చేసుకున్నాడు . ఆ తర్వాత ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ బాలికను శారీరకంగా వాడుకున్నాడు. దీని ఫలితంగా ఆమె గర్భవతి అయింది. ఆడపిల్లకు జన్మనిచ్చింది.
దీంతో మైనర్ బాలిక తనను పెళ్లి చేసుకోమని అడగడంతో సమీర్ అందుకు నిరాకరించాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని ,అంతేకాకుండా కట్నం ఇస్తే పెళ్లి చేసుకుంటానంటూ, కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేశాడు. దీంతో మైనర్ బాలిక అతని వేధింపులు భరించలేక స్థానికులకు, తల్లిదండ్రులకు విషయం తెలిపింది.. గర్భవతి అయినా మైనర్ బాలిక విషయం సమీర్ తో స్థానికులు మాట్లాడి పెళ్లి చేసుకోవాలని నచ్చచెప్పారు.
ఈ సంఘటన తర్వాత సమీర్ అక్కడి నుంచి పారిపోయాడు. గత ఏడాది నవంబర్ 12వ తేదీన మైనర్ బాలిక ఒక పాపకు జన్మనిచ్చింది. అయితే ఆ యువకుడు పెళ్లికి నిరాకరిస్తున్నడంతో ఈనెల 6వ తేదీన కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో న్యాయం చేయాలంటూ సమీర్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది.