ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈరోజు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అదనంగా మరో మూడు లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ముద్రా స్కీము లబ్దిదారులకు కూడా ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. రైతులకు కూడా కేంద్ర క్యాబినెట్ మరిన్ని రాయితీలను ప్రకటించింది. ధాన్యం నిల్వలపై పరిమితిని ఎత్తేసింది. కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇప్పటికే మూడు లక్షల కోట్లు కేటాయించారు. దీనికి అదనంగా ఇప్పుడు మరో మూడు లక్షల కోట్లను కేటాయించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందింది.