బలగం పోశవ్వ జీవితంలో ఇంత విషాదమా..?

బలగం పోశవ్వ జీవితంలో ఇంత విషాదమా
బలగం పోశవ్వ జీవితంలో ఇంత విషాదమా

బలగం పోశవ్వ (విజయలక్ష్మి).. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా బలగం సినిమా పేరు విపరీతంగా వినిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఒకవైపు ఓటీటీలో కూడా మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ కూడా అప్పటివరకు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని వారే.. ఇక ఈ మూవీతో వారందరికీ మంచి గుర్తింపు వచ్చింది దాంతో పాటు పెద్ద సినిమాలలో నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి.

ముఖ్యంగా ఎవరు ఊహించని విధంగా బలం సినిమాలో నటించిన ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు బాగా దగ్గర అయిందని చెప్పాలి. ముఖ్యంగా ఇందులో కొమురయ్య చెల్లి పోశవ్వ పాత్రను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. ఒకవైపు అన్న చనిపోయాడని ఏడుస్తూనే.. అందర్నీ ఒక గంట కనిపెడుతూ అవకాశం దొరికినప్పుడల్లా సూటిపోటి మాటలంటూ గొడవలకు కారణమవుతూ ఉంటుంది. ఇలాంటి పాత్రలో నటించిన విజయలక్ష్మి జీవితంలో మాటలకందని ఊహించని విషాదం దాగి ఉందట.

ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన భర్త నాలుగేళ్లకే తన చిన్న కొడుకు మరణించడంతో జీవితంలో తట్టుకోలేని బాధను అనుభవించాను. నేను చేసిన తొలి సినిమా బలగం .. ఇది యదార్ధంగా జరుగుతున్న కథ ..నాకు ఈరోజు మంచి పేరు రావడానికి కారణం వేణుగారే.. ఈ సినిమా సహజంగా రావడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడ్డాము.

నా భర్త చనిపోయాక నా పిల్లల పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఇద్దరు కొడుకులు ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. కానీ నా చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ సమయంలో అతని భార్య గర్భవతి.. ఇక నా జీవితంలో తట్టుకోలేని విషాదం అది.. అన్ని విధాలుగా తోడుండే భర్త చనిపోవడం ఆయన మరణించిన నాలుగేళ్లకు చేతికందిన కొడుకు ప్రాణాలు కోల్పోవడం అన్నీ కూడా నన్ను మానసికంగా కలవరపెడుతున్నాయి. ఇప్పటికీ ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్నాను అంటూ కన్నీటి పర్యంతమయ్యారు బలగం పోశవ్వ విజయలక్ష్మి.