ఏపీలో చంద్రబాబు నాయుడుని అమ్మనా తిట్టే నాయకుడు ఎవరంటే డౌట్ లేకుండా కొడాలి నాని పేరు ప్రతి తెలుగు తమ్ముడు చెబుతాడు. ఎందుకంటే కొడాలి ఏ స్థాయిలో బాబుని తిడతారో చెప్పాల్సిన పని లేదు. అందుకే కొడాలి అంటే తమ్ముళ్ళు రగిలిపోతూ ఉంటారు. తమ్ముళ్ళు జగన్ పైన అంత కసిగా ఉంటారో లేదో తెలియదు గాని..కొడాలిపై మాత్రం కసిగా ఉంటారు.
ఇప్పటికే రెండుసార్లు ఓడించాలని చెప్పి విఫలమయ్యారు. కానీ కొడాలిని ఈ సారి ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళు ఎంత కసితో ఉన్నా..అందుకు తగ్గట్టుగా బాబు ప్రణాళికలు లేవు. గుడివాడలో మళ్ళీ ఎలా గెలవాలనే వ్యూహాలు కనిపించడం లేదు. ఇప్పటికీ అక్కడ అభ్యర్ధి ఎవరనేది డిసైడ్ చేయలేకపోతున్నారు. కొడాలి నాని టిడిపి నుంచి వైసీపీలోకి వెళ్లిన తర్వాత ..2014లో రావి వెంకటేశ్వరరావుని తీసుకొచ్చి నిలబెట్టారు. ఆయన ఓడిపోయారు. ఐదేళ్ల పాటు పార్టీ తరుపున పనిచేశారు.
అయినా సరే రావిని పక్కన పెటట్టి 2019లో దేవినేని అవినాష్‌ని తీసుకొచ్చి నిలబెట్టారు. అవినాష్ సైతం కొడాలిపై ఓడిపోయి..వైసీపీలోకి వెళ్లారు. మళ్ళీ రావిని తీసుకొచ్చి ఇంచార్జ్ గా పెట్టారు. ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము వచ్చి గుడివాడ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. టిడిపిలో దూకుడుగా పనిచేస్తున్నారు. దీంతో రావి, రాము మధ్య పోటీ వచ్చింది..ఆధిపత్య పోరు కనబడుతోంది.
పోనీ ఇద్దరిలో ఎవరోకరిని అభ్యర్ధిగా ప్రకటించడం లేదు. పక్కనే ఉన్న గన్నవరంలో వల్లభనేని వంశీపైన పోటిగా, వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావుని అభ్యర్ధిగా ఫిక్స్ చేశారు. మరి గుడివాడ ఎందుకు వదిలేశారని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. అభ్యర్ధిని త్వరగా ఫిక్స్ చేస్తే మంచిదని, అలా కాకుండా అభ్యర్ధిని చివరి నిమిషంలో పెడితే..అసలు గ్రూపు తగాదాలు ఉన్నాయి. అంతా కలిసికట్టుగా పనిచేస్తారనే గ్యారెంటీ లేదు. దీంతో గుడివాడలో టిడిపికి మళ్ళీ దెబ్బతగలడం ఖాయమని అంటున్నారు.