మిల్కీ బ్యూటీ ఫామిలీ లో ఇద్దరికీ కరోనా పాజిటివ్

మిల్కీ బ్యూటీ ఫామిలీ లో ఇద్దరికీ కరోనా పాజిటివ్

గత ఆర్నెల్లుగా ప్రజలందరూ కూడా కరోనా వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కుంటున్నామో అందరికీ తెలిసిందే. అయితే ఈ కరోనా ప్రభావం ఇపుడు సామాన్య ప్రజల నుంచి సినీ తారలు వరకు వచ్చేసింది. ఈ మధ్య కాలంలోనే చాలా మంది స్టార్ హీరోలు, సింగర్స్, హీరోయిన్స్ కు కూడా కరోనా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మన సినీ వర్గాలు ఆశ్చర్య పోయేలా మరో వార్త బయటకొచ్చింది. ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా స్వయంగా చెప్పారు

గత వారం నుంచి తన తల్లిదండ్రులకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నట్టు తాము గుర్తించగా అప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని తర్వాత వారు ఎందుకైనా మంచిది అని కోవిడ్ పరీక్షలు చేయించుకున్నామని ఇప్పుడు తాజాగా ఫలితాలు వచ్చాక షాకయ్యినట్టుగా ఆమె తెలిపింది. తమ తల్లిదండ్రులు ఇద్దటికీ కరోనా పాజిటివ్ వాచినట్టు నిర్ధారణ అయ్యిందని అలాగే తనతో పాటు కుటుంబంలో ఉన్న మిగతా వారికి మాత్రం నెగిటివ్ వచ్చినట్టుగా తమన్నా తెలిపింది.