మీ పాస్‌వర్డ్‌ను నిమిషంలోపే క్రాక్ చేస్తుందట..! సేఫ్‌గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా…

It will crack your password within a minute..! Do you know what to do to stay safe?
It will crack your password within a minute..! Do you know what to do to stay safe?

ఇటీవలి కాలంలో చాట్ జిపిటి ఆవిర్భావంతో పాటు అనేక రకాల ఏఐ టూల్స్ మెయిన్ స్ట్రీమ్ ఇంటర్నెట్ యూజర్లకు అందుబాటులోకొచ్చాయి. దీని వినియోగం కూడా రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. చిన్నా, పెద్ద టెక్నికల్ సమస్యలను ఏఐ చిటికెలో పరిష్కరిస్తోంది. దీని పనితీరుపై అందరూ సానుకూలంగానే స్పందించారు. అయితే మనం వాడే ఇంటర్నెట్ ప్రతి సందర్భంలోనూ ఉపయోకరంగా ఉండదని.. కొన్నిసార్లు సెక్యూరిటీకి సంబంధించిన ముప్పు పొంచి ఉంటుందని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.దీంతో నెటిజన్ల వ్యక్తిగత డేటా లీకయ్యే ప్రమాదం ఉంది. దీనిపై హోమ్ సెక్యూరిటీ హీరోలు ఇటీవలే ఓ అధ్యయనం నిర్వహించారు. వారి 51 శాతం సాధారణ పాస్‌వర్డ్‌లను ఏఐ నిమిషాల్లో క్రాక్ చేసేస్తుందని అధ్యయనం ప్రకారం ఒక నివేదిక వెలువడింది .

ఎంత సమయం పడుతుందంటే..

ఏఐ టెక్నాలజీ 65 శాతం పాస్‌వర్డ్‌లను కేవలం గంటలోపే క్రాక్ చేయగలదని ఆ కంపెనీ పరిశోధనలో వెల్లడించారు. సుమారు నెలలో 85 శాతం పాస్‌వర్డ్‌లను ఛేదించేందుకు సమయం పడుతుంది. అంతటి అనూహ్యమైన శక్తి ఈ ఏఐ టెక్నాలజీకి ఉంది. ఏఐకి మీ పాస్‌వర్డ్‌ ఎంత బలంగా ఉన్నా.. దాన్ని క్షణాల్లో క్రాక్ చేయగల సత్తా ఉందని కొన్ని అధ్యయనాలు ఇదివరకే స్పష్టం చేశాయి.

సులభంగా క్రాక్ చేయొచ్చు..

కొన్ని ప్రత్యేక గుర్తులు, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, నెంబర్ల కలయికతో రూపొందించిన పాస్‌వర్డ్‌లను క్రాక్ చేయడానికి ఈ మిషన్‌కి 6 క్విన్టిలియన్ సార్లు పడుతుందని కంపెనీ వివరించింది. అంటే ఏఐ అలాంటి పాస్‌వర్డ్‌లను ఛేదించేందుకు చాలా సమయం పడుతుంది. కాబట్టి సైబర్ సెక్యూరిటీ నిపుణులు మీ పాస్‌వర్డ్‌లలో అక్షరాలు మాత్రమే ఉంటే ఏఐ సులభంగా క్రాక్ చేయొచ్చని చెబుతున్నారు.

ఏవి భద్రంగా ఉంటాయంటే..

ఈ అధ్యయనం ప్రకారం, 18 అక్షరాల కంటే ఎక్కువ ఉన్న పాస్‌వర్డ్‌లు ప్రస్తుతం భద్రంగా ఉన్నట్లు తేలింది. ఏఐ మిషన్ ఈ రకమైన పాస్‌వర్డ్‌లను క్రాక్ చేసేందుకు పాస్‌జెన్ వంటి మిషన్ కి సుమారు 10 నెలల సమయం పడుతుంది.

మీ పాస్‌వర్డ్‌ను సురక్షితంగా ఎలా ఉంచుకోవాలంటే.

ఈ అధ్యయనం ప్రకారం, సాధారణ పాస్‌వర్డ్‌ల కంటే ప్రత్యేక అక్షరాలు, నెంబర్లతో కూడిన పాస్‌వర్డ్‌లను క్రాక్ చేసేందుకు ఏఐకి ఎక్కువ సమయం పడుతుంది. 10 పదాల పాస్‌వర్డ్‌ను చిన్న అక్షరాలతో క్రాక్ చేసేందుకు ఏఐ టెక్నాలజీ మిషన్ కి ఒక గంట పడుతుంది. ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను ఛేదించేందుకు సుమారు 4 వారాల సమయం పడుతుంది. కాబట్టి చిన్న, పెద్ద ప్రత్యేక అక్షరాలు ,నెంబర్ లతో పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకుంటే ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.