స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి పోలీసులు ఈరోజు వేకువజామున అరెస్ట్ చేశారు. దీంతో ఏపీవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అనంతపురం, కడప , కర్నూలు నుంచి వచ్చిన బెటాలియన్లు చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్ కి చేరుకొని నోటీసులు అందజేశారు. పోలీసులు తీవ్ర ఉద్రిక్తత మధ్య అరెస్టు చేసి చంద్రబాబును విజయవాడకు తరలించారు. ముందు జాగ్రత్తగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అన్ని జిల్లాలలో టిడిపి నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.
పోలీసులు గొల్లపూడి లో దేవినేని ఉమామహేశ్వర రావు ని కూడా గృహనిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమంగా అరెస్టు చేసారని అన్నారు. రాబోయే రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలా వేలాదిమంది పోలీసులతో కలిసి టీడీపీ నాయకులను నిర్బంధిస్తున్నారని.. రాష్ట్రంలో ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు.