హైదరాబాద్ లో ఘోరం జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఈ దుర్ఘటన జరగడంతో సర్వత్రా కలకలం రేగుతోంది. పెళ్లైన మూడు రోజులకే లాక్‌డౌన్ స్టార్ట్ కావడంతో భార్య తన భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక ఆ యువతి ఆ వేదనను భరించలేక తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. ఉప్పుగూడ దానయ్యనగర్‌కు చెందిన మోహన్ కుమార్తె వనజ(19)కు వరంగల్‌కు చెందిన అనిల్ అనే యువకుడితో మార్చి 19న ఘనంగా పెళ్లైంది.
అయితే పెళ్లి జరిగిన మూడో రోజునాడే లాక్‌డౌన్ విధించడంతో వనజ అత్తవారింటికి వెళ్లే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. కానీ.. ఆ యువతి మాత్రం భర్తను తన వద్దకు తీసుకెళ్లమని రోజూ ప్రాధేయపడుతూ వస్తుంది. అయితే రవాణా సౌకర్యం లేకపోవడం.. లాక్‌డౌన్ ముగిశాక సంప్రదాయబద్ధంగా తీసుకెళ్తామని అత్తమామలు చెప్పడం వంటివి చోటు చేసుకున్నాయి. ఈ మధ్యలో అనిల్ రెండుమూడు సార్ల బైక్‌పై అత్తారింటికి వచ్చి భార్యను చూసి వెళ్లడం జరిగింది.
అయినప్పటికీ భర్తకు దూరంగా ఉండాల్సి వస్తోందని వనజ తీవ్ర మనస్తాపానికి లోనైంది. దీంతో ఆ యవతి మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా పెళ్లైన రెండు నెలలకే వనజ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.