సొంత ఇంట్లోనే మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్య జరిగిన ఇంతకాలం అయినా ఈ కేసు లో వీరే ప్రధాన ముద్దాయిలు అంటూ కోర్ట్ లు నిర్ధారించి శిక్షలు వేయడం ఇంకా పూర్తి కాలేదు. కానీ కొందరిని అనుమానంతో కొన్ని సాక్ష్యాలు ఆధారంగా చేసుకుని సిబిఐ అరెస్ట్ లు చేసి విచారించింది. కొందరిని అరెస్ట్ చేసి క్రమంలో మరి కొందరిని కోర్ట్ లో కేసులు నడుస్తున్నాయి.
ఇక తాజాగా ఈ కేసులో నాంపల్లి సిబిఐ కోర్ట్ లో విచారణ స్టార్ట్ కాగా… ఈ విచారణకు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి,సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి,ఉదయ్ కుమార్ రెడ్డి మరియు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లు హాజరవ్వడం జరిగింది.ఇరు పక్షాల లాయర్ల వాదనలు విన్న తర్వాత సిబిఐ కోర్ట్ విచారణను సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఇంకా ఈ కేసుకు ఎంతకాలంకు పుల్ స్టాప్ పడుతుందో తెలియడం లేదు..