సరికొత్త ట్వీట్: నాగబాబు వివాదాల ట్వీట్ల వర్షం……

రాజధాని విషయం పై స్పందిచిన నటుడు నాగబాబు

టాలీవుడ్ మెగా బ్ర‌ద‌ర్ నాగాబాబు ఏమాత్రం తగ్గడం లేదు. మే 19వ తేదీ నాథూరాం గాడ్సే జ‌యంతిని పురస్కరించుకొని ఆయ‌న గొప్ప దేశ‌భ‌క్తుడు అంటూ ట్వీట్ చేసి వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. అయితే నాగబాబు కామెంట్స్‌పై ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేయ‌డంతో తాను తను భావాన్ని.. చెప్పాల‌నుకున్న విషయాన్ని చెప్పానని తెలిపారు. దీంతో నాగ‌బాబుపై కాంగ్రెస్ నాయ‌కులు కేసు పెట్టారు.

తాజాగా నాగబాబు మ‌రో ట్వీట్ చేసి హాట్ టాపిక్‌గా నిలిచారు. ఆయన ఈసారి ఏమన్నారంటే.. ‘ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రి, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజపేయ వంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనం మర్చిపోకూడదని ఒక ఆశ.
గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశంకోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తుకు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్లపై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తుంది.