భారతదేశపు సంజీవనిగా ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుంటున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై డబ్ల్యూహెచ్‌వో కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్, క్లోరోక్విన్ ఔషధాల వాడకంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మలేరియా వంటి వ్యాధుల చికిత్సలో వాడుతున్న ఈ మందులను కొవిడ్-19 విషయంలో ఔషధ పరిశోధనలకు మాత్రమే పరిమితం చేయటం మంచిదని తెలిపింది.
అంతేకాకుండా… కొవిడ్ చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను కొన్ని దేశాలు ఇప్పటికే వాడుతున్న విషయంపై డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. పలు రకాల వ్యాధుల చికిత్సలో హైడ్రాక్సీ ఔషధాలను వాడేందుకు అనుమతి ఉందని… ఐతే వీటిని కొవిడ్-19 చికిత్సలో లేదా దాని నియంత్రణలో ప్రభావవంతంగా పనిచేస్తాయనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదని వెల్లడించింది. కాగా కరోనా విషయంలో ఈ ఔషధ వాడకం ఆయా దేశాల విచక్షణపై ఆధారపడి ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.