పవన్‌ కోసం కీర్తి సురేష్‌ ప్రయోగం

‪keerthi suresh Dubbing for pawan kalyan agnathavasi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం షూటింగ్‌ ముగిసింది. ఇటీవలే వారణాసి షెడ్యూల్‌ కూడా పూర్తి చేయడంతో షూటింగ్‌ వర్క్‌ పూర్తి అయ్యింది. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం మెల్లగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను త్రివిక్రమ్‌ చక్కబెట్టే పనిలో ఉన్నాడు. ఈ చిత్రంలో నటించిన నటీనటులు ఒక్కరొక్కరుగా డబ్బింగ్‌ను పూర్తి చేస్తున్నారు. పవన్‌కు జోడీగా నటించిన కీర్తి సురేష్‌ ఈ చిత్రం కోసం డబ్బింగ్‌ చెబుతుంది. ఇప్పటి వరకు తెలుగులో పలు చిత్రాల్లో నటించిన కీర్తి సురేష్‌ డబ్బింగ్‌ చెప్పుకోలేదు. మొదటి సారి పవన్‌ సినిమాతో తన డబ్బింగ్‌ ప్రయాణంను తెలుగులో ప్రారంభించబోతుంది.

pspk

పాత్రకు తగ్గట్లుగా కీర్తి సురేష్‌ వాయిస్‌ ఉంటుందని, అలాగే ఆమె తెలుగు బాగా మాట్లాడుతుందనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్‌ ఆమెతో డబ్బింగ్‌ చెప్పించేందుకు సిద్దం అయ్యాడు. మొదట కీర్తి సురేష్‌ కాస్త వెనుకాడినా కూడా తాజాగా హుషారుగా తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పింది. తన పాత్రకు డబ్బింగ్‌ పూర్తి చేశాను అంటూ కీర్తి సురేష్‌ స్వయంగా ఫొటోను పోస్ట్‌ చేసి చెప్పింది.

suresh

మరో హీరోయిన్‌ అనుఎమాన్యూల్‌కు మాత్రం బయట వ్యక్తి డబ్బింగ్‌ చెప్పనుంది. కీర్తి సురేష్‌ డబ్బింగ్‌కు పవన్‌ ఒకే చెప్పాడని, త్రివిక్రమ్‌ నిర్ణయాన్ని పవన్‌ గౌరవించి ప్రొసీడ్‌ అవ్వమన్నాడు అంటూ సమాచారం అందుతుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను నేడు విడుదల చేయబోతున్నారు. ఆ ఫస్ట్‌లుక్‌తో సినిమా టైటిల్‌ ఏంటీ, ఇంకా ఇతర వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది.

keerty-suresh