అయితే రాధిక అనే అమ్మాయి తన ఇంటి ముందుకు పార్కింగ్ ప్రాంతంలో ఆడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అఖిలేష్ అనే కారు డ్రైవర్ ఆ చిన్నారిని గమనించకుండా కారును నపడటంతో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. పశ్చిమ ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ దీపక్ పురోహిత్ ఈఘటనపై మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన రాధికను వెంటనే దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారని అక్కడ బాలిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని అన్నారు. కాగా ఆ చిన్నారు తండ్రి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ కారు ఎలివేటర్ వ్యాపారం నడుపుతున్న జస్బీర్ సింగ్ సొంతం. కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వివరించారు. ఆ చిన్నారిని ఆసుపత్రిలో పోస్ట్మార్టం పూర్తి చేసి ఆ చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసుల అధికారులు వివరించారు.