పదేళ్లు పూర్తి చేసుకోనున్న కార్తీక్ ,జెస్సీల ప్రయాణం

పదేళ్లు పూర్తి చేసుకోనున్న కార్తీక్ ,జెస్సీల ప్రయాణం

నాగ చైతన్య,సమంత తొలిసారి కలిసి నటించిన ‘ఏ మాయ చేసావే’ సినిమా ఈ బుధవారంతో పదేళ్లు పూర్తి చేసుకోనుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో జెస్సీగా సమంత నటనను ఎవరు మరిచిపోలేదు.ఈ సినిమా తర్వాత నటిగా సమంత హీరోయిన్‌గా వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ అయింది. అంతేకాదు తొలి సినిమాలో తనకు జోడిగా నటించిన నాగ చైతన్యను ప్రేమ పెళ్లి చేసుకొని అక్కినేని వారి ఇంటి కోడలైంది.

అంతేకాదు పెళ్లి తర్వాత సినిమాల విషయంలో సమంత అదే దూకుడును కంటిన్యూ చేస్తోంది. అంతేకాదు పెళ్లికి ముందు కంటే ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఇప్పటికీ అందరినీ మాయ చేస్తూనే ఉంది. ఈ ఇయర్ సమంత.. జాను సినిమాతో పలకరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన వసూళ్లను రాబట్టలేదు. తాజాగా సమంత.. ఇపుడు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న రెండో సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు నాగ చైతన్య.,., శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కానుంది. మొత్తానికి ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సమంత, నాగ చైతన్యలు ప్రేమలో పడ్డారు. ఈ రకంగా చూస్తే.. వీరి ప్రేమకు పదేళ్లు పైమాటే అని చెప్పొచ్చు.