బాహుబలి హిట్ తర్వాత ప్రభాస్ క్రేజ్

బాహుబలి హిట్ తర్వాత ప్రభాస్ క్రేజ్

బాహుబలి లాంటి హిట్ తర్వాత ప్రభాస్ క్రేజ్ ఎంతలా పెరిగి పోయింది అంటే ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న కూడా దాదాపు 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అంటే ప్రభాస్ క్రేజ్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా బాలీవుడ్ లోనే 200 కోట్లు రాబట్టింది ఈ సినిమా. ఇక ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏమిటి అనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ని ఒప్పించేందుకు ముగ్గురు నలుగురు డైరెక్టర్లు కూడా క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కొరటాల శివ చెప్పిన కథకు ఓకే చెప్పిన ప్రభాస్… ఆ తర్వాత అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగాతో మరో మూవీ చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ చెప్పిన కథకు కూడా ప్రభాస్ ఓకే చెప్పాడట. అంతేకాదు తాజాగా మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. నితిన్ హీరోగా నటించిన భీష్మ సినిమా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ దృష్టి వెంకీ కుడుముల పై కూడా పడిందట. ఇక వెంకీ కుడుముల ప్రభాస్ ను కలిసి ఒక స్టోరీ లైన్ చెప్పాడట. దీనికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.