ట్రాఫిక్ పోలీసులకు, ఆటో డ్రైవర్‌కు మధ్య గొడవ

ట్రాఫిక్ పోలీసులకు, ఆటో డ్రైవర్‌కు మధ్య గొడవ

ఆటోను నో పార్కింగ్ స్థలంలో ఆపినందుకు ట్రాఫిక్ పోలీసులకు, డ్రైవర్‌కు మధ్య గొడవ జరిగింది. డ్రైవర్‌పై పోలీసులు దాడి చేసిన తరువాత ఆటోకు జరిమానా విధించారు. ఆటోవాలాకు పోలీసులు టీ తాగించి పంపించిన సంఘటన మహారాష్ట్రలోని కలీనా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆటో డ్రైవర్ షాదేబ్ అలీ (32) కలీనా ప్రాంతంలో పోలీస్ పోస్టు ముందు నో పార్కింగ్ స్థలంలో ఆటోను ఆపారు. దీంతో ఆటోను ఇక్కడి నుంచి తీయాలని ఆటోవాలాకు సూచించారు. దీంతో అలీ, స్థానిక పిఎస్ ఎస్‌ఐ ధొండిరామ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అలీని త్రీవంగా కొట్టి నాలుగు వందల రూపాయలు జరిమానా విధించారు. అనంతరం డ్రైవర్ అలీతో కలిసి పోలీసులు టీ తాగారు. డ్రైవర్‌ను అక్కడి నుంచి పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. తనపై దాడి చేసిన పోలీసులపై ఆటో డ్రైవర్ ఏ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని వకోలా ఇన్స్ పెక్టర్ కైలాశ్ చంద్ర అవాద్ తెలిపాడు.