గుంటూరులో అత్యంత హేయమైన దుశ్చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో పదో తరగతి బాలికను నమ్మించి ఏడాదిగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు, ఆమెను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేస్తూ వచ్చారు. అందుతున్న సమాచారం మేరకు గుంటూరులోని స్వర్ణభారతీనగర్ కు చెందిన బాలిక నగరంపాలెం పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతోంది. చదలవాడ త్రినాథ్ అనే యువకుడు ఆ బాలిక ఇంటికి సమీపంలోనే ఉంటున్నాడు. ఇంటర్ తర్వాత చదువు ఆపేసి కూలీ పనులు చేస్తున్న త్రినాథ్ ప్రేమ పేరుతో ఆ బాలిక వెంటపడ్డాడు. ఎంతకూ ఆమె తన మాయలో పడకపోవడంతో ఆ బాలిక ఇళ్ళ పక్కన ఉండే అంటీలను మచ్చిక చేసుకున్నాడు. అక్కా అని పిలుస్తూ వారిళ్ళకి వెళ్ళే బాలికను ముగ్గురు మహిళలు వంచించారు. బాలిక నివాసానికి సమీపంలో ఉండే మహిళ, త్రినాథ్ ఇంటి పక్కనే ఉండే మరో మహిళ, అదే ప్రాంతంలో ఉండే ఇంకో మహిళ వీరంతా బాలికకు మాయమాటలు చెబుతూ త్రినాథ్ వైపు ఆకర్షితురాలయ్యేలా చేసినట్టు సమాచారం. ఆమెకు ఖరీదైన చాక్లెట్లు, బహుమతులు ఇచ్చిన త్రినాద్ చివరికి ప్రేమలో పడేశాడు.
అనంతరం అదే ప్రాంతంలో ఉండే మహిళ 2 రోజుల పాటు నిర్బంధించి ఇద్దరు యువకులతో అత్యాచారం చేయించినట్టు సమాచారం. కొన్ని రోజుల తర్వాత వెంగళాయపాలెం కొండల్లోని ఒక స్నేహితుడి గదికి తీసుకెళ్లిన సందర్భంలో వారి నుంచి తప్పించుకుని పారిపోయిన బాలికను ఓ మహిళ కాపాడినట్టు తెలిసింది. పలుమార్లు బాలికపై అత్యాచారం చేయటంతో పాటు అందుకు సహకరించిన యువకులు, పాఠశాల వద్ద బాలిక కిడ్నాప్‌నకు సహకరించిన వారిపై కేసు నమోదు చేశారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 29న కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం త్రినాథ్ సహా అతని స్నేహితులు మోహన్‌కృష్ణ, చిన్ని, ఇజ్రాయిల్, వలీ ఇలా మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అత్యాచార ఘటనలో 15 మంది వరకూ ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.