12వ విడత పీఎం కిసాన్.. ఇప్పటి వరకు 22 వేలు అకౌంట్లలో జమ…

పీఎం కిసాన్
పీఎం కిసాన్

కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పలు రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏటా రూ. 6 వేలు లభిస్తున్నాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. విడతల వారీగా వస్తాయి. రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి.

ప్రధాని మోదీ మే 31న పీఎం కిసాన్11వ విడత డబ్బులను విడుదల చేశారు. 10 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో రూ 21 వేల కోట్ల జమ చేశారుపీఎం కిసాన్ తర్వాతి విడత డబ్బులు సెప్టెంబర్ 1న విడుదల కావొచ్చని తెలుస్తోంది.
వెలువడుతున్న నివేదికల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులు సెప్టెంబర్ 1న విడుదల చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ డబ్బులు పొందాలంటే రైతులు కచ్చితంగా కేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. దీనికి
గడువు జూలై 31తో ముగుస్తుంది.