తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో మార్చి 31 వరకు షాపింగ్ మాల్స్ విద్యాసంస్థలు థియేటర్లు షూటింగ్ లు బంద్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో మొత్తం 13 పాజిటివ్ కేసులు నమోదు కాగా..నిన్న ఒక్కరోజే 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ సర్కార్ మరింత అప్రమత్తమైంది. కొద్దిరోజుల పాటు తెలంగాణలో 144 సెక్షన్ విధించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ప్రజలెవరూ బయట తిరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోక తప్పదని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.
విదేశీయుల తాకిడి ఎక్కువగా ఉన్న హైదరాబాద్ తో పాటు తెలంగాణలో కరోనాను దీటుగా ఎదుర్కొనేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. దీనికితోడు కరీం నగర్ లో కరోనా వ్యవహారం కేసీఆర్ ను కలవరపెడుతోందట. ఈ నేపథ్యంలోనే కొంచెం కఠినంగా అనిపించినా….తెలంగాణలో 144 సెక్షన్ విధించాలని కేసీఆర్ యోచిస్తున్నారట. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలను ఇళ్లదగ్గరే ఉంచాలని అందుకు 144 సెక్షన్ విధించడం ఒక్కటే మార్గమని కేసీఆర్ భావిస్తున్నారట.