కిమ్ ఎప్పుడో ఒక‌ప్పుడు నాకు స్నేహితుడు అవుతాడు

Trump on the back foot

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రెండు దేశాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఉత్త‌రకొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను ఉద్దేశించి అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి. అమెరికా భూభాగం గువాన్ పై క్షిప‌ణి దాడిచేస్తామ‌ని కిమ్ హెచ్చ‌రించ‌డంతో రెండు దేశాల మ‌ధ్య మొద‌లైన ఉద్రిక్త‌త‌లు అంత‌కంత‌కూ పెరుగుతూ పోయాయే త‌ప్ప ఏనాడూ చ‌ల్లార‌లేదు. కిమ్ వ‌రుస క్షిప‌ణి ప్ర‌యోగాల‌తో అమెరికాను రెచ్చ‌గొట్ట‌డం, బ‌దులుగా ట్రంప్ తీవ్ర వ్యాఖ్య‌ల‌తో స్పందించ‌డం మూడు నెల‌లుగా రెండు దేశాల మ‌ధ్య చోటు చేసుకుంటున్న ప‌రిణామం. దుందుడుకు వైఖ‌రి ప్ర‌ద‌ర్శించే కిమ్ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ..అగ్ర‌రాజ్య అధ్య‌క్షుడి హోదాలో ప‌రిణితితో వ్య‌వ‌హారించాల్సిన కిమ్ ఎక్క‌డా అలాంటి వైఖ‌రి క‌న‌బ‌ర్చ‌లేదు. కిమ్ క‌న్నా రెండాకులు ఎక్కువే చ‌దివాన‌న్న‌ట్టుగా…వ్య‌వ‌హరించారు. ఐక్య‌రాజ్య‌స‌మితిలో అమెరికా అధ్య‌క్షుడి హోదాలో తొలిసారి ప్ర‌సంగించిన సందర్భంగా తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తాను త‌ల‌చుకుంటే ఉత్త‌ర‌కొరియాను స‌ర్వ‌నాశ‌నం చేయ‌గ‌ల‌న‌ని హెచ్చ‌రించారు.

అంతేకాకుండా..ఐరాస భ‌ద్ర‌తామండ‌లిలో పావులు క‌దిపి…ఉత్త‌ర‌కొరియాపై ఆంక్ష‌లు విధించేలా చేశారు. అమెరికా విదేశాంగ‌మంత్రి, ర‌క్ష‌ణ‌మంత్రులు ఉత్త‌ర‌కొరియాతో చ‌ర్చ‌ల ప్ర‌స్తావ‌న చేసిన‌ప్ప‌టికీ ఎప్ప‌టిక‌ప్పుడు ట్రంప్ వాటిని తోసిపుచ్చారు. అందుకే అమెరికా ప్ర‌తిప‌క్షనేద‌తు ఉత్త‌రకొరియా విష‌యంలో ట్రంప్ వైఖ‌రిని తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. హిల్ల‌రీ క్లింట‌న్ అయితే ఓ అడుగు ముందుకేసి ట్రంప్ త‌న తెలివిత‌క్కువ విధానాల‌తో మూడో ప్ర‌పంచ యుద్ధం తెచ్చేలా ఉన్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. అయిన‌ప్ప‌టికీ ట్రంప్ త‌న ప‌ద్ధ‌తి మార్చుకోలేదు. ఆసియా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నాలుగు రోజుల క్రితం`ద‌క్షిణ కొరియాలో ప‌ర్య‌టించిన ట్రంప్…అప్పుడు కూడా కిమ్ పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అమెరిక‌న్లను త‌క్కువ అంచ‌నావేస్తే కిమ్ కు ఇరాక్ మాజీ అధ్య‌క్షుడు స‌ద్దాం హుస్సేన్, లిబియా మాజీ అధ్య‌క్షుడు గ‌డాఫీకి ప‌ట్టిన గ‌తే ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు.  ఇలా అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా కిమ్ జాంగ్ ఉన్ పై విమ‌ర్శ‌లు, హెచ్చ‌రిక‌ల‌తో విరుచుకుప‌డే ట్రంప్..
తాజాగా కిమ్ ను ఉద్దేశిస్తూ ఎప్పుడో ఒక  రోజు అత‌ను త‌న‌కు స్నేహితుడు అవుతాడ‌ని వ్యాఖ్యానించ‌డం అంత‌ర్జాతీయంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌యింది. కిమ్ త‌న‌పై చేసిన విమ‌ర్శ‌లపై స్పందించే క్ర‌మంలో ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ట్రంప్ ఆసియా ప‌ర్య‌ట‌న‌ను లక్ష్యంగా చేసుకుని కిమ్ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేశారు. ట్రంప్ వృద్ధుడు, ఆయ‌న వ‌ల్ల ఏమ‌వుతుంది అని ఎద్దేవాచేశారు. మామూలుగా అయితే కిమ్ చేసిన విమ‌ర్శ‌ల‌పై ఎదురుదాడికి దిగే ట్రంప్ ఈ సారి మాత్రం చాలా హుందాగా స్పందించారు. కిమ్ వ్యాఖ్య‌ల్ని త‌ప్పుప‌డుతూనే తానూ విమ‌ర్శ‌లు చేశారు.  న‌న్న‌ ముస‌లివాడంటూ కిమ్ ఎందుకు అవ‌మాన‌ప‌రుస్తున్నారు?  నేను ఎప్పుడైనా..కిమ్ ను పొట్టిగా, లావుగా ఉన్నాడ‌ని అన్నానా..? అని ట్రంప్ ట్విట్ట‌ర్ లో ప్ర‌శ్నించారు. అంత‌టితో ఆగ‌కుండా కిమ్ కు స్నేహితుడిగా ఉండేందుకు తాను ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని, ఏదో ఒక రోజు అది జ‌రుగుతుందని కూడా ట్వీట్ చేశారు. ట్రంప్ ట్వీట్ నెట్ లో వైర‌ల్ అవుతోంది. ప్ర‌త్య‌ర్థి దేశాధ్యక్షుణ్ని ట్రంప్ ఇలా స్నేహితుడితో పోల్చ‌డం చూస్తుంటే యుద్ధం విష‌యంలో ఆయ‌న వైఖ‌రి మారుతోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.