మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు మహాత్మాగాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుగనున్నాయి.ఉదయం 8గంటల నుండి 11గంటల వరకు అక్టోబర్6న ఇర్వింగ్ లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో ఈ ఉత్సవాలు నిర్వహించబోతున్నారు.ముఖ్యఅతిధిగా టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్అబ్బాట్ విచ్చేస్తున్నారని మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.తోటకూర ప్రసాద్ తెలిపారు.మహాత్మాగాంధీకి నివాళులు అర్పించి గ్రెగ్అబ్బాట్ ప్రసంగిస్తారని చెప్పారు.ముఖ్య అతిధులుగా టెక్సాస్ రాష్ట్రప్రతినిధి జూలీజాన్సన్,డిప్యూటీకాన్సల్ జనరల్అఫ్ఇండియా సురేంద్ర అదానా కూడా హాజరు కాబోతున్నారని ప్రకటించారు.