18 ఓటిటి యాప్స్ బ్యాన్ : భారతదేశం లో డిజిటల్ సెన్సార్షిప్ పెరుగుతోందా?

18 OTT Apps Ban: Is Digital Censorship on the Rise in India?
18 OTT Apps Ban: Is Digital Censorship on the Rise in India?

వరల్డ్ వైడ్ గా ఇప్పుడు ఓటిటి రంగం ఎంత ఆదరణ అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఇక మన దేశంలో కూడా ఓటిటి బాగా పాపులర్ అయిపోయింది . అయితే ఉండగా ఉండగా ఈ ప్లాట్ ఫామ్ లో సెన్సార్ లాంటివి లేకపోవడంతో కొన్ని అడల్ట్ వెబ్ సిరీస్ లు మూవీ లు లాంటివి వీటి లోనే రావడం స్టార్ట్ అయ్యాయి.

అయితే మనకి తెలిసినవి కొన్నే కానీ ఇవి కాకుండా చాలా ఇతర ఓటిటి యాప్స్ కూడా భారతదేశంలో ఉన్నాయి. ఇవి మరింత ఎక్కువ స్థాయిలో అశ్లీలతని ప్రచారం చేస్తుండడంతో వాటిలో మొత్తం 18 యాప్స్ ను భారత ప్రభుత్వం ఇప్పుడు నిషేధించినట్టుగా తెలుస్తుంది. సమాచార మరియు బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ వారు ఈ నిర్ణయాన్ని తీసుకొని భారీ ఎత్తున అశ్లీల కంటెంట్ ను ఓటిటి లో ప్రమోట్ చేస్తున్న 18 యాప్స్ పై ను బ్యాన్ చేశారు.

18 OTT Apps Ban: Is Digital Censorship on the Rise in India?
18 OTT Apps Ban: Is Digital Censorship on the Rise in India?

అంతే కాకుండా వీటికి సంబంధిత 57 సోషల్ మీడియా అకౌంట్స్ ను సోషల్ మీడియా యాప్స్ లో అలాగే వారి అనుబంధ వెబ్ సైట్స్ మొత్తం 19 ని కూడా శాశ్వతంగా తొలగించారు. ఇప్పటికే ఓటిటిలో అడల్ట్ కంటెంట్ ఎక్కువ అవుతుంది అని వారించే వారు చాలా మంది ఉన్నారు మరి వారికీ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

నిషేధించబడిన 18 OTT ప్లాట్‌ఫారమ్‌ల జాబితా:

Dreams Films
• Voovi
• Yessma
• Uncut Adda
• Tri Flicks
• X Prime
• Neon X VIP
• Besharams
• Hunters
• Rabbit
• Xtramood
• Nuefliks
• MoodX
• Mojflix
• Hot Shots VIP
• Fugi
• Chikooflix
• Prime Play